తెలంగాణ మంత్రి హరీశ్ రావు సభకు ఆలస్యమైనందుకు తనకు తాను రూ.50లక్షల జరిమానాగా విధించుకున్నారు. మహిళలకు మెప్మా రుణాలు, చెత్తబుట్టల పంపిణీ కోసం మధ్యాహ్నం 11:30 గంటలకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీశ్ సభ ఖరారైంది. తీరా హరీశ్.. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి సభాస్థలికి చేరుకునే సరికి మధ్యాహ్నం 3:30 అయింది.
అప్పటిదాకా ఎంతో ఓర్పుగా వేచి చూస్తున్న మహిళలకు హరీశ్ క్షమాపణలు చెప్పారు. పరిహారంగా తనకు జరిమానా విధించాలని వారిని కోరారు. దీంతో తమకు మహిళా భవనం కోసం నిధులను మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి సరేనన్నారు. మహిళా భవన నిర్మాణానికి రూ.50లక్షలను మంజూరు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు.
కేసీఆర్ తీరుతో రాష్ట్రం అభాసుపాలు: ఉత్తమ్