ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో విషాదం చోటు చేసుకుంది. దిల్కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు. పది మందికి పైగా గాయపడ్డారు.లక్నో దిల్ ఖుషా ప్రాంతంలో ప్రాంతంలో శుక్రవారం వేకువ జామున ఈఘటన జరిగింది.
ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు.. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు సహాయక చర్యలను చేపడుతున్నారు.
గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడం వల్లే గోడ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఆ గోడ పక్కనే ఉన్న గుడిసెల్లో నివసిస్తున్న తొమ్మిది మంది బలయ్యారని తెలిపారు.
ఈ విషాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. . మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దీంతో పాటు క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.