telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

విద్యార్థినికి చీర కడుతూ సేల్స్ మెన్ అసభ్య ప్రవర్తన.. ఏడాది జైలు, 2 వేల జరిమాన

New couples attack SR Nagar

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వస్త్ర దుకాణానికి చీర కొనేందుకు వెళ్లిన ఓ యువతి పట్ల సేల్స్ మెన్ అసభ్యంగా ప్రవర్తించడంతో  కూకట్‌పల్లిలోని 8ఎ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. ఏపీపీ గోపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం… చింతకింది యాదగిరి(27) జగద్గిరిగుట్ట అంజయ్యనగర్‌లో నివసిస్తూ కూకట్‌పల్లి వై జంక్షన్‌లోగల ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.

గత ఏడాది జూలై 31న ఓ విద్యార్థిని చీర కొనుగోలు చేసేందుకు షోరూంకి వెళ్లింది. తాను ఎంపిక చేసుకొన్న చీర కట్టుకొంటే ఎలా ఉంటానో చూపించమని ఆమె కోరగా.. యాదగిరి విద్యార్థినికి చీర కడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్‌ శ్రీదేవి నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రెండువేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ఏపీపీ తెలిపారు.

Related posts