telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆసనాలతో.. జీర్ణశక్తి వృద్ధి.. ఇలా…

yogasanas for digestion issues and

సాంప్రదాయక వైద్యం అంటే అది ఆసనాలు లేదా యోగ అని చెప్పేయవచు. అంతటి ప్రాచీన భారత వైద్యంగా చెప్పబడుతున్న ఈ ఆసనాలు ఒక్కసారి గురుముఖంగా నేర్చుకొని, సమయాన్ని అనుకూలంగా చేసుకొని మరీ, రోజు కాసేపు వాటిని వేస్తూ పోతే అనారోగ్య సమస్యలు అంటూ ఉండవు. ఒక్కసారి నేర్చుకుంటే, ఎంత సులభమో అర్ధం అవుతుంది. అందులో కొన్ని, అది సహజంగా నేటి ఆహార అలవాట్ల వలన పెరిగిపోతున్న సమస్య అజీర్తి.. దీనితో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే ముందు దానికి పరిష్కరించుకుంటే, అసలు సమస్యలు లేకుండా జీవించవచ్చు. ఇక్కడ కొన్ని అటువంటి ఆసనాలు చూద్దాం.. కొన్ని ఆసనాలకు కౌంటర్ ఆసనాలు ఉంటాయి. రెండు కలిపి చేస్తే చాలా లాభాలు చేకూరుతాయి. పొట్ట తగ్గేందుకు, జీర్ణశక్తి పెరిగేందుకు ఈ కింది ఆసనాలు బాగా పనిచేస్తాయి. ముందుగా పశ్చిమోత్తానాసనం వేశాక పూర్వోత్తానాసనం వేయాలి.

yogasanas for digestion issues and1. పశ్చిమోత్తానాసనం

ముందుగా కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఆ తర్వాత కాళ్ళను ముందుకు చాచి రెండు అరచేతులను పక్కన ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను నిదానంగా పైకి లేపి చెవులకు ఆన్చాలి. ఇప్పుడు శరీరాన్ని పైకి లాగినట్లు ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. శ్వాసను వదులుతూ వెన్ను, మెడ వంగకుండా నడుమును మాత్రం వంచాలి. ఈ స్థితిలో పొత్తికడుపు మీద ఒత్తిడి పడుతుంది. శరీరాన్ని వంచి చేతులతో కాలిబొటన వేళ్లను పట్టుకోవాలి. ఇప్పుడు శరీరాన్ని మరింతగా వంచుతూ తలను మోకాళ్ల మధ్య ఉంచి రెండు మోచేతులను నేలకు తాకించాలి. మోకాళ్లు పైకి లేవకుండా చూసుకోవాలి. ఈ స్థితిలో సాధారణంగా శ్వాస తీసుకుంటూ ఉండగలిగినంత సేపు ఉండి మెల్లగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇలా ఆరు నుంచి 10సార్లు చేయాలి. మొదటిసారి ప్రయత్నించేవాళ్ళకు తల మోకాళ్ల మధ్యకు రాదు. నెమ్మదిగా ప్రయత్నం మీద సాధించవచ్చు.

ఉపయోగాలు :

– కండరాల మీద ఒత్తిడితో పొట్ట కరుగుతుంది.
– రక్తశుద్ధి జరుగుతుంది.
– జీర్ణశక్తి పెరుగుతుంది.
– ప్రధానంగా క్లోమగ్రంథి ఉత్తేజితం కావడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
– మలబద్దకం ఉండదు.
– గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, తలనొప్పి తగ్గుతాయి.

yogasanas for digestion issues and2. పూర్వోత్తానాసనం

ముందుగా దండాసనంలో కూర్చోవాలి. అంటే.. రెండుకాళ్లను ముందుకు చాచి రెండు చేతులూ శరీరానికి ఇరుపక్కలా ఉంచుకోవాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నడుము భాగాన్ని పైకి లేపాలి. చేతులు నడుముకు ఆరు సెంటీమీటర్ల వెనక వైపునకు ఉంచాలి. అరచేతులు భుజాల కిందుగా ఉండేట్లు చూడాలి. పాదాలు సమాంతరంగా ఉండాలి. కాలి వేళ్లు భూమిని తాకేట్లుగా ప్రయత్నించాలి.

ఉపయోగాలు :

– పశ్చిమోత్తానాసనంలో వెన్నెముకను ముందుకు వంచుతాం. దానికి వ్యతిరేకంగా వెన్నెముకను ఈ ఆసనంలో స్ట్రెచ్ చేస్తాం.
– ఊపిరితిత్తులు, గుండెకు మంచి ఆరోగ్యకరమైన ఆసనం.
– చేతులు, పాదాలు ధృడంగా మారుతాయి.

Related posts