telugu navyamedia
సినిమా వార్తలు

చిలుకూరు ఫామ్‌హౌస్‌లో విజయ నిర్మల అంత్యక్రియలు

Vijaya-Nirmala

టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆమె స్వగృహానికి తీసుకొచ్చారు. ఈ రోజు స్వ‌గృహంలోనే విజ‌య నిర్మ‌ల భౌతిక కాయాన్ని ఉంచ‌నున్నారు. ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు విజ‌య నిర్మ‌ల భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. విజయనిర్మల అంతిమ యాత్ర రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు నానక్ రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. అభిమానుల సంద‌ర్శ‌నార్ధం ఫిలిం చాంబ‌ర్‌లో కొద్ది సేపు ఉంచ‌నున్నారు. ఆ త‌ర్వాత చిలుకూరులోని ఫామ్‌హౌస్‌లో అంతిమ సంస్కారం జరుగుతుంది. శుక్రవారం మ‌హా ప్ర‌స్థానంలో విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. ఇంటికి చేరిన విజయ నిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు.

Related posts