telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్‌ నిర్ణయాన్ని సమర్థించిన అమెరికా

terrorists group

ఉగ్రవాదం పై కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీలను కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు భారత కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా సమర్థించింది.

ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో భారత్‌కు అమెరికా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు నలుగురు ఉగ్రవాదులు మౌలానా మసూత్‌ అజర్‌, హఫీజ్‌ సయీద్‌, జకీ ఉర్‌ రెహ్మాన్‌, దావూద్‌ ఇబ్రహీంలను ఉగ్రవాదులుగా గుర్తిస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతున్నాం. భారత్‌- అమెరికా కలిసి ఉగ్రవాదులను ఏరివేయడానికి ఈ కొత్త చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం అని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాల బ్యూరో ట్వీట్‌ చేసింది.

Related posts