telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు సాంకేతిక

పుకార్లు వ్యాప్తి చేస్తున్న … ట్విట్టర్ ఖాతాలు బ్లాక్…

twitter accounts blocked on rumors

జమ్మూకశ్మీర్ కు సంబందించిన ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం కఠినచర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్ లో పలు ఆంక్షలు విధించిన కేంద్రం తాజాగా పలు అనుమానాస్పద ట్విట్టర్ అకౌంట్లపై దృష్టి సారించింది. విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశాలుండడంతో, ఆ నకిలీ ఖాతాలను తొలగించాలంటూ కేంద్ర హోం శాఖ ట్విట్టర్ ను ఆదేశించింది. 8 ఖాతాలు వదంతుల వ్యాప్తికి కారణమవుతున్నట్టు గుర్తించిన హోం శాఖ ఆ మేరకు ట్విట్టర్ కు వివరాలు అందించింది. ఆ ఖాతాలను తొలగించాలని సూచించింది.

కేంద్రం అనుమానాస్పదంగా భావిస్తున్న ఖాతాలు :

1.@kashmir787-వాయిస్ ఆఫ్ కశ్మీర్
2.@Red4Kashmir-మదీహా షకీల్ ఖాన్
3.@arsched-అర్షద్ షరీఫ్
4.@mscully94-మేరీ స్కల్లీ
5.@sageelaniii-సయ్యద్ అలీ గిలానీ
6.@sadaf2k19
7.@RiazKha61370907
8.RiazKha723

Related posts