telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ట్రంప్‌కు ట్విట్టర్, ఫేస్‌బుక్ మరోసారి షాక్

trump usa

నిబంధనలు ఉల్లంఘిస్తూ పోస్టులు పెట్టినందుకు ఫేస్‌బుక్‌ అమెరికా ట్రంప్‌ ఖాతాను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ట్విట్టర్‌ సైతం ట్రంప్‌ చేసిన మూడు ట్వీట్ లను తొలగించాలని కోరుతూ తాత్కాలికంగా ఖాతాను నిలిపివేసింది. అధ్యక్ష ఎన్నికలపైనా, వాషింగ్టన్‌ డీసీలో కొనసాగతున్న హింసాత్మక నిరసనల పట్ల ఆధారరహిత వ్యాఖ్యలు చేయడంతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ట్రంప్‌ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపాయి. రెండు రకాల పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్‌ పోస్టులు పెట్టడంతో ఖాతాకు తాత్కాలికంగా చెక్‌ పెట్టినట్లు ఫేస్బుక్‌ పేర్కొంది. ఇదే విధంగా కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్‌ నియామకాన్ని నిలిపివేయమంటూ ట్రంప్‌ మద్దతుదారులు కాంగ్రెస్‌పై నిరసనలను వ్యక్తం చేస్తున్న అంశంపై ట్విట్టర్‌ 12 గంటలపాటు ఖాతాను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ అంశాలపై చేసిన మూడు ట్వీట్‌లను తొలగించవలసిందిగా సూచించింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధఃగా ఉన్న ఈ ట్వీట్‌లను తొలగించకపోతే… ఈ బ్యాన్‌ కొనసాగుతుందని ట్విట్టర్‌ స్పష్టం చేసింది.

Related posts