telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం

Sekhar-Kammula

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) కన్నుమూశారు. ఈ రోజు (శనివారం) ఉదయం 6 గంటలకు ఆయన మరణించినట్లు సమాచారం. వయసు పైబడటంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అతిత్వరలో ఈ ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Related posts