telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ పథకాలను చంద్రబాబు కాపీ: కేటీఆర్‌

KTR Counter pawan comments
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొడుతున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో తెలంగాణ యూని యన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ సంస్థ ఆధ్వర్యం లో జరిగిన ఆందోల్  ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అభినందన సభకు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేస్తే.. తాను కూడా అదే చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు.  చంద్రబాబువి ఆపద మొక్కులని.. చిత్తశుద్ధి లేని శివపూజలు చేస్తే ఒరిగేదేం లేదంటూ విమర్శించారు.బాబు చేసే పనుల్లో చిత్తశుద్ధి ఉండదన్నారు. ఏపీ ప్రజలు చైతన్యవంతులని చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా అక్కడి ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు. 
రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు అవుతున్నా కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఇంకా ఆ భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. ఇలాంటి ధోరణి మానుకోవాలని సూచించారు. తాను ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ కొన్ని పత్రికలు చూస్తే అందులో తెలంగాణ వార్తలు ఉండవని, తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉన్నట్లుగానీ, ఒక ముఖ్యమంత్రి ఉన్నట్లుగానీ వార్తలు కనిపించవని అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతగా పేర్కొన్నారు.

Related posts