telugu navyamedia
తెలంగాణ వార్తలు

వర్షానికి భాగ్యనగరంలో స్తంభించిన‌ జనజీవనం..

రోజంతా ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరంలో జనజీవనం స్తంభించింది.  గత నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ సహా ఈసీ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరదనీరు పోటెత్తుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో నాలుగు రోజుల పాటు తెలుగు రెండు రాష్ట్రాల్లో అతి భారీ వర్ష సూచన. ఇప్పటికే తెలంగాణలో ఆరంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ట్రాఫిక్‌ స్తంభన..
రోడ్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్‌ రైల్వేబ్రిడ్జీ, జూబ్లీహిల్స్, పంజగుట్ట, అమీర్‌పేట్, మూసాపేట్, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, చంపాపేట్, చాంద్రాయణగుట్ట, మోహిదీపట్నం, అత్తాపూర్, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ వన్, మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, ఆరీ్టసీక్రాస్‌ రోడ్డు, అంబర్‌పేట్, రామంతాపూర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  

 వ‌ర్షం కార‌ణంగా పొంగిపొర్లుతున్న‌ హైదరాబాద్ నాల‌లు..వరదనీటి కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జాం .

Related posts