telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరిషత్ ఎన్నికల్లో రెండు చోట్ల పోలింగ్ కు బ్రేక్

Gram Panchayat elections Poling started

తెలంగాణలో జిల్లా, మండల పరిషత్ తొలి విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2,097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలోని మొయినాబాద్ మండలం హాజీజ్ నగర్ లో ఏర్పాటు చేసిన 111వ నంబర్ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు తారుమారు అయ్యాయి.

ఓ గ్రామానికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు మరో గ్రామంలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. దీంతో ఎన్నికల అధికారులు పోలింగ్ ను నిలిపివేశారు. మరోవైపు ఇదే కారణంతో యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం షేరిగూడెంలో కూడా పోలింగ్ ఆగిపోయింది. జనగామకు చెందిన బ్యాలెట్ పత్రాలు షేరిగూడెంకు వచ్చాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts