telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతు దినోత్సవం గూర్చి మాట్లాడే అర్హత జగన్ రెడ్డి సర్కారుకి లేదు..

ఏపీ ప్రభుత్వంపై నిమ్మల రామానాయుడు ఫైర్‌ అయ్యారు. రైతు దినోత్సవం గూర్చి మాట్లాడే అర్హత జగన్ రెడ్డి సర్కారుకి లేదని… రాష్ట్రంలో ఉంది రైతు దగా ప్రభుత్వం, రైతు మోస ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయాలలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. చంద్రన్న ప్రభుత్వం హెక్టారుకు అందించిన రూ. 20 వేల ఇన్ పుట్ సబ్సిడీని.. రూ. 16 వేలకు తగ్గించారని…. ఇది రివర్స్ పాలన కాదా..? అని ప్రశ్నించారు. 2019 ఏడాదికి గానూ రైతుల తరపున ఇన్సూరెన్స్ కట్టకుండా.. నిలువునా మోసగించారని… అసెంబ్లీలో తెలుగుదేశం నిలదీయడంతో.. రాత్రికి రాత్రి అరకొరగా రూ. 510 కోట్లు విడుదల చేశారన్నారు.
2020 డిసెంబర్ వచ్చినా ఈ ఏడాదికి సంబంధించి ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించలేదని.. రైతులపై పగబట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఫైర్‌ అయ్యారు. పోలవరం ఎత్తు తగ్గించి ప్రాజెక్టు అర్థం, పరమార్థం మార్చివేశారని… వ్యవసాయానికి ఆక్సిజన్ వంటి ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతూ మోటార్లను బిగిస్తున్నారని నిప్పులు చెరిగారు. రైతు ఆత్మహత్యలలో రాష్ట్రాన్ని దేశంలో మూడో స్థానంలో నిలిపారని…. రైతులకు సంకెళ్లు వేసి.. నడిరోడ్డుపై నడిపించిన ఘనత దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు.

Related posts