telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సైబర్ నేరాలతో మహిళల ఇబ్బందులు: తానేటి వనిత

vanitha tatineni minister

సైబర్ నేరాలతో ఉద్యోగాలు చేసే మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత అన్నారు. ఈ రోజు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… అర్ధటెక్నాలజీకి అలవాటు పడ్డవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెక్నాలజీ ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకోవాలన్నారు. టీనేజర్స్‌ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. తల్లిదండ్రుల కలలు.. విద్యతో నెరవేర్చాలని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. .

వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుకుంటే నేరగాళ్ల బారిన పడకుండా ఉంటారని ఆన్నరు. చదువుతో పాటు ఆరోగ్యం పట్ల మహిళలు శ్రద్ధ చూపాలి. బాల్యవివాహాలు వ్యతిరేకించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ ఘటన దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం పొంచి ఉన్నపుడు మహిళలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని పేర్కొన్నారు.

Related posts