telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా పరీక్షల్లో ఏపీ దేశంలోనే ముందంజ: సీఎం జగన్

cm jagan ycp

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ కరోనాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందనన్నారు. ఇప్పటివరకు 1.65 లక్షల కరోనా టెస్టులు నిర్వహించామని చెప్పారు. చెన్నైలోని కోయంబేడు హోల్ సేల్ మార్కెట్ కారణంగా తమిళనాడులోనే కాదు ఏపీలోనూ పలు జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందినట్టు గుర్తించారు.

 కోయంబేడు మార్కెట్ కారణంగానే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. స్క్రీనింగ్ లేకుండానే రాష్ట్రంలోకి 700 మంది కూలీలు ప్రవేశించారని వెల్లడించారు. అందుకే సరిహద్దు ప్రాంతాల్లో 11 చోట్ల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Related posts