telugu navyamedia
andhra news political

పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా అమ్మఒడి: మంత్రి తానేటి

vanitha tatineni minister

పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని అమలు చేశారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం కొవ్వూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణకు సీఎం జగన్‌ పెద్దపీట వేస్తున్నారని అన్నారు.

సంఘమిత్ర ఉద్యోగుల జీతాలు పదివేలకు పెంచారని, మహిళల, అలాగే పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారని తెలిపారు. మద్యపాన నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తూ, గ్రామాల్లో బెల్టు షాపులను తొలగించి మహిళల జీవితాల్లో ఆనందం నింపారని అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌ చేయూతను అందిస్తున్నారని మంత్రి తెలిపారు.

Related posts

ఐపీఎల్ లో మరికొన్ని మ్యాచ్ లకు దూరంకానున్న పంత్…

Vasishta Reddy

ఢిల్లీలో రాహుల్ తో చంద్రబాబు భేటీ

vimala p

71 ఏళ్ళ వయసులో… 32 పళ్ళు ఊడిపోయాయని .. రాష్ట్రపతికి పిర్యాదు… కిమ్స్ పై …

vimala p