telugu navyamedia
రాజకీయ

వర్కౌట్స్ చేస్తున్న తమిళనాడు సీఎం.. వైరల్‌

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ (68) వయసులో కూడా ఆయన చాలా చురుగ్గా వర్కౌట్స్‌ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. తలైవర్‌ ఫిట్‌నెస్‌ వర్కౌట్స్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. మరోవైపు టీఐ సైకిల్స్‌ సంస్థ స్టాలిన్‌ ఒక కొత్త సైకిల్‌ను కూడా ప్రెజెంట్‌ చేయడం విశేషం.

ఎంత బిజీగా ఉన్నా శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ ప్రముఖుల్లో సీఎం స్టాలిన్‌ ఒకరు. త్వరగా నిద్ర లేవడం, నడక, సైక్లింగ్‌, యోగా తన దినచర్యలో ఒక భాగమనీ ఇదివరకే డీఎంకే నేత స్టాలిన్‌ ప్రకటించారు. ఏ పనిలోఉన్న పది రోజులకోకసారి సైకిల్ తొక్కుతానని, కర్ణాటక సంగీతం వినడం కూడా తనకు చాలా ఇష్టమని ఆయన అన్నారు.

Related posts