తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన ఆలయంలో రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం కేసీఆర్‌కు తీర్థ ప్రసాదాలు అందచేశారు. మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి హైదరాబాద్ బయల్దేరతారు.
అంతకు ముందు ఆయన సిరిసిల్ల బ్రిడ్జ్ దగ్గర కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదికి కేసీఆర్ జలహారతి ఇచ్చారు. అలాగే మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌ను ఆయన పరిశీలించారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రి అధికారికంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సీఎంతో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్ ఉన్నారు.