telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాధురీ దీక్షిత్ 24 ఏళ్ల కుర్ర హీరోతో రొమాన్స్ చేస్తే చూడాలని ఉంది… ప్రముఖ సింగర్ వ్యాఖ్యలు

sona

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, తమిళ స్టార్ హీరో ధనుష్ కలిసి ‘అత్రంగి రే’ అనే హిందీ సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని మొన్ననే టీం ప్రకటించింది. దీనిపై ప్రముఖ సింగర్ సోనా మొహాపాత్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎప్పుడూ 50 ఏళ్ల హీరో పక్క 23 ఏళ్ల హీరోయిన్‌నే ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ‘‘ఏదో ఒకరోజు 52 ఏళ్ల మాధురీ దీక్షిత్ 24 ఏళ్ల కుర్ర హీరోతో కలిసి రొమాన్స్ చేస్తే చూడాలని ఉంది. ఎప్పుడూ హీరోనే పెద్దవాడు ఎందుకు అయివుండాలి? రూల్ అందరికీ ఒకేలా ఉండాలి కదా. ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకుందని చాలా మంది ఏడ్చారు. ఆమెను నోటికొచ్చినట్లుగా ట్రోలింగ్ చేసిన విషయం గుర్తుందా?’’ అంటూ మండిపడ్డారు.

Related posts