telugu navyamedia
సినిమా వార్తలు

హీరో సిద్ధార్థ్ పై నయనతార బాయ్ ఫ్రెండ్ అసహనం

Siddharth-and-Nayan

ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతారపై తమిళ సీనియర్ నటుడు రాధారవి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోలీవుడ్ లో తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై కోలీవుడ్ ప్రముఖులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన సిద్ధార్థ్… మీటూ విషయంలో సైలెంట్ గా ఉన్న సినిమా పెద్దలు… ఇప్పుడు నయనతార విషయంలో మాత్రం ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో స్పందించని వాళ్లకు మద్దతు తెలపడంతో ఆంతర్యం ఏమిటో వాళ్ళకే తెలియాలి అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చూసిన నయనతార బాయ్ ఫ్రెండ్, దర్శకుడు విగ్నేష్ శివన్… నయనతార మీతో బాధితులకు తన సినిమాల్లో అవకాశాలు ఇప్పించిందని, వాళ్ళను ఆర్థికంగా కూడా ఆదుకుందని, కానీ ఇలాంటి విషయాలను పబ్లిసిటీ చేసుకునే మార్గం తనకు తెలియదంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఇక టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి టాప్ రేంజ్ కు వెళ్ళిన సిద్ధార్థ్ ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కు వెళ్ళాడు. ఈ లవర్ బాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.

Related posts