telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉద్యోగ భద్రతే తమకు ప్రధానం: మంత్రి పువ్వాడ

puvvada ajay

ఆర్టీసీ ఉద్యోగ భద్రతే తమకు ప్రధానమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో కొత్త ఛాంబర్‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడు మాసాలుగా ఏ ఒక్క కార్మికుడిని సస్పెండ్ చెయ్యలేదని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులుకు మార్చి 31 లోపు సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఈ-బిడ్డింగ్ విధానం ప్రారంభించామని తెలిపారు. ఫాన్సీ నంబర్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలిపారు.

ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చమని, ఆర్టీసీ సిబ్బందికి సొంతగా యాజమాన్యం వేతనాలు ఇచ్చిందన్నారు. వాహనాల కొనుగోలు సంఖ్య తగ్గడంతో టాక్స్ రెవెన్యూ పడిపోయిందని పేర్కొన్నారు. మాంద్యం ప్రభావం రవాణా శాఖపై కూడా ఉంటుందన్నారు. ప్రభుత్వానికి రవాణా శాఖ ద్వారా రూ. 3 వేల కోట్ల ఆదాయము వస్తుందని, రవాణా శాఖ ఖర్చు రూ.180 కోట్లు మాత్రనని, ఇంకా ఖర్చులను తగ్గించుకుంటామని చెప్పారు.

Related posts