telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

సుమీత్ నాగల్ కు .. రోజర్ ఫెదరర్ ప్రశంసలు..

rojar fedarad praised indian tennis player

భారత టెన్నిస్ ఆశాకిరణం సుమీత్ నాగల్ యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడం ద్వారా సంచలనం సృష్టించిన తొలి మ్యాచ్ లో రోజర్ ఫెదరర్ అంతటి దిగ్గజాన్ని సైతం రెండు గంటలు పైగా కోర్టులో కలియదిప్పాడు. ఈ మ్యాచ్ లో నాగల్ ఓడిపోయినా ఫెదరర్ ప్రశంసలను అందుకున్నాడు. 2 గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో నాగల్ 6-4, 1-6, 2-6, 4-6 తో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్ గెలిచిన నాగల్ ఆపై ఫెదరర్ అనుభవం ముందు తలవంచాడు.

నాగల్ తన ప్రతిభతో స్విస్ స్టార్ ను ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫెదరర్ మాట్లాడుతూ, నాగల్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డాడు. తన సత్తా ఏంటో తాను తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఈ విషయంలో నాగల్ ఫర్వాలేదని తెలిపాడు. నాగల్ చాలా స్థిరమైన ఆటతీరు కనబర్చాడని, అయితే ఈ మ్యాచ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదని ఫెదరర్ తెలిపాడు.

Related posts