telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

శశికళ బినామీ ఆస్తులను .. స్వాధీనం చేసుకున్న ఐటీశాఖ ..

IT handover assests of sasikala

ఆదాయ పన్ను శాఖ శశికళకు చెందిన రూ. 1600 కోట్ల విలువైన బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 2016 నవంబర్‌లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న తరువాత చెన్నై, పుదుచ్చెరీల్లో వేర్వేరు చోట్ల ఉన్న 9 ఆస్తులను ఆమె కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దాదాపు రూ. 1500 కోట్ల విలువైన రద్దైన నోట్లతో ఆ ఆస్తులను శశికళ బినామీ పేర్లతో కొన్నట్లు, నగదు చెల్లింపుల ద్వారానే ఆ కొనుగోలు జరిగినట్లు నిర్ధారించారు.

ప్రస్తుతం అక్రమ ఆస్తుల కేసులో శశికళ బెంగళూరులోని జైళ్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2017లో ఐటీ అధికారులు శశికళతో పాటు ఆమె సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై భారీగా దాడులు నిర్వహించారు. చెన్నై పోయెస్‌ గార్డెన్‌ లోని జయలలిత ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఆ సమయంలోనే ఈ 9 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం.

Related posts