telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆస్కార్ నుంచి మ‌ధ్య‌లోనే తొలగించబడిన “గల్లీ బాయ్”

Gully-Boy

92వ ఆస్కార్ అవార్డ్స్ కార్య‌క్ర‌మం ఫిబ్ర‌వ‌రి 9న లాస్ ఏంజెల్స్‌లో ఘ‌నంగా జ‌ర‌న‌గున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌, గ్లామ‌ర్ బ్యూటీ అలియా భ‌ట్ నటించిన గల్లీ భాయ్‌ చిత్రం 92వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు భారత్‌ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ముంబై మురికివాడల్లో పెరిగిన ఓ యువకుడు ఇండియాలోనే టాప్‌ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. అయితే షార్ట్ లిస్ట్‌లో భాగంగా టాప్ 10 నుండి ఈ మూవీని తొల‌గించ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది నేష‌న‌ల్ అవార్డ్ పొందిన అస్సాం చిత్రం విలేజ్ రాక్ స్టార్స్ కూడా మ‌ధ్య‌లోనే ఆస్కార్ నామినేష‌న్స్ నుండి తొల‌గించ‌బ‌డింది. మ‌న‌దేశం నుండి అమీర్ ఖాన్ న‌టించిన “ల‌గాన్” చిత్రం ఆస్కార్ నామినేషన్స్‌కి ఎంపికైన విష‌యం తెలిసిందే.
92వ ఆస్కార్ అవార్డ్స్ లో భాగంగా షార్ట్ లిస్ట్ చేసిన ఉత్త‌మ విదేశీ చిత్రాలు
థోస్ హూ రిమైన్డ్ – హంగేరి, హ‌నీలాండ్ – నార్త్ మెసిడోనా, కోర్ప‌స్ క్రిస్టి- పోలాండ్‌, అట్లాంటిక్స్- సెన‌గ‌ల్‌, పార‌సైట్ – సౌత్ కొరియా, బీన్‌పోలే- ర‌ష్యా, ది పైన్టెడ్ బ‌ర్డ్- క్జెచ్ రిప‌బబ్లిక్, ట్రూత్ అండ్ జ‌స్టిస్‌- ఎస్టోనియా, లెస్ మిసెర్బాల్స్ – ఫ్రాన్స్‌, పెయిన్ అండ్ గ్లోరీ – స్పెయిన్. ఇక ఐదు అంతర్జాతీయ చిత్రాలను ఎంపిక చేసే తదుపరి రౌండ్ నామినేషన్లు జనవరి 13 న ప్రకటించబడతాయి. 

Related posts