వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “డిస్కోరాజా”. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ ఫస్ట్ లుక్ లో రవితేజ సోఫాలో దర్జాగా కూర్చుని ఓ చేతిలో సిగార్ పట్టుకుని మరో చేతిలో గన్నుతో చిరునవ్వు చిందిస్తూ విభిన్నమైన లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. డిసెంబర్ 20, 2019న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్ ’ ఫేమ్ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను మరో నాయికగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి సాంగ్ విడుదలైంది. “నువ్వు నాతో ఏమన్నావో.. నేనేం విన్నానో..” అంటూ సాగే ఈ పాట వైబ్స్ క్రియేట్ చేస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం , గాన గాంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం ఆలాపన, ఎస్. ఎస్. థమన్ వినసొంపైన సంగీతం సంగీత ప్రియులని వేరే లోకానికి తీసుకెళుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.
previous post