telugu navyamedia
సినిమా వార్తలు

కూర్చొని అకౌంట్‌లో డబ్బులన్నీ నొక్కేసాడు..!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నిక‌లు రోజు రోజుకి వేడి పుట్టుస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకముందే.. ఆరోపణలు, ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడేలా కొంతమంది చూస్తున్నారని.. లేదా ఎన్నికలు లేకుండా నరేశ్‌నే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రూ.5కోట్లలో రూ.3 కోట్లు మాత్రమే నరేశ్‌ ఇప్పటివరకూ ఖర్చు చేశారని.. మిగతావి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు.

పోయినసారి మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం రెండున్నర కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క. ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుంది. ఇప్పుడాయన హాయిగా కూర్చుని మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు.

ఇప్పుడాయన ఆ కుర్చీ దిగకూడదు దిగకుండా ఉండేందుకు నరేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఉదయం 200 మంది అసోసియేషన్‌ సభ్యులకు హేమ లేఖలు రాశారు. ఏది ఏమైనా ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరిగేలా చూడాలంటూ వారికి సంతకాలు పెట్టండి అంటూ హేమ వాయిస్ మెసేజ్ పంపింది.

కాగా ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం రేసులోకి దిగుతున్న హేమ నరేశ్‌పై నటి హేమ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా ఈసారి మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు ప్రకటించారు.

మా ఎన్నికల బరిలోకి ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్‌ నరసింహారావు ఉన్నారు. కానీ పోటీ మాత్రం మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మధ్యే కనిపిస్తుంది. లోకల్, నాన్ లోకల్ అనే వాదన వినిపించినా.. ఆ తర్వాత ఎన్నికలు లేవు ఏకగ్రీవమే అని పెద్దలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే గత కొన్నిరోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న హేమ ఉన్నట్లుండి అధ్యక్షుడు నరేశ్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Related posts