telugu navyamedia
సినిమా వార్తలు

సమాజంలో నేటి మహిళ..

samajamlo neti mahila poetry corner
తొలిపొద్దు కంటే ముందుగా లేచి…
అణకువకు ఆభరణంగా మలచి…
శుచిశుభ్రతే భాద్యతగా భావించి…
ఆత్మీయంగా పలకరించే పవనమై….
ఆటుపోట్లను ఎదుర్కొనే మహాసంద్రమైన…
ఓ మహిళా నీవే కదా భావితరాలకు మార్గసూచిక…
నీ మనస్సు మమతల నెలవైన ఓ కోవెల…
నవరత్నాలు పొదిగిన సువర్ణమయ పేటిక…
అహం తెలియని నీలోని ఓర్పు  భూగోళమై…
అమ్మలా అక్కలా ఆదరించడంలో అవనివై…
మానవ సృష్టికి జన్మప్రదాతగా…
ఆత్మస్థైర్యాన్నీ ఆయుధంగా మలచి…
అణచివేతను ఎదుర్కొని ఆదర్శంగా నిలవాలి..
సాంప్రదాయాల నిర్వహణలో అగ్రగామివై…
మహిళా అంటే మండే అగ్నిగోళమై…
హాయిగొలిపే వెన్నెల కిరణానివై…
దేశరక్షణలో ముందుండే వాయుసేనగా…
అక్షరాలు నేర్పేవేళ అపరసరస్వతిలా గురువుగా…
రాజకీయ సమపాలనలో చతురత చూపి…
సేవాతత్పరలో వైద్యరంగాన నిలిచి…
అన్నిరంగాలను అవపోసనపట్టి…
దేశవిదేశ అందాల పోటీలలో లావణ్యం చూపి ప్రపంచ దేశాలలో భారత ఖ్యాతిని నలుదిశలా  ప్రత్యేకంగా నిలిపిన…
ఓ భారతమహిళా నీకు వేలవేల వందనాలు…
-దూడపాక శ్రీధర్, మంథని

Related posts