హైదరాబాద్ లోని కేపీహెబ్ పోలీసు స్టేషన్ పరిధిలో రియాల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్‌భాస్కర్‌రెడ్డిని కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులు. గత నెల 20 నుండి విజయ్ భాస్కర్ అందుబాటులో లేడు. ఫోన్ స్వీచ్చాఫ్ వస్తుంది. దీంతో అనుమానం వచ్చిన అల్లడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగ్గారు. సీసీ కెమెరాలో దృశ్యలలో కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మాజీ సైనికోద్యోగి మల్లేశ్, స్థిరాస్తి వ్యాపారి సుధాకర్, కృష్ణంరాజుతోపాటు ఓ వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో హత్య కుట్ర బహిర్గతమైంది. విజయ్‌భాస్కర్‌రెడ్డిని హత్య చేసి శ్రీశైలంలోని సున్నిపెంటలో కాటికాపరిని మభ్యపెట్టి శవ దహనం చేసినట్లు దుండగులు పోలీసులకు తెలిపారు. ఈ నలుగురుని అరెస్ట్ చేసిన పోలీసులు రిమెండ్‌కు తరలించారు.