telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నా ఊపిరి ఆగిపోయినా… ఐలవ్ యూ” అల్లు అర్జున్ ట్వీట్ ఎవరికంటే ?

Allu-arjun

ప్ర‌స్తుతం అల్లు అర్జున్… త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో “అల వైకుంఠపురంలో” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే త‌న కెరియ‌ర్‌ని పూర్తిగా మార్చేసిన ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల ద‌ర్శ‌కుడు సుకుమార్‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ తాజాగా ట్వీట్ చేసాడు బ‌న్నీ. ఆర్య చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఆర్య 2 చిత్రం 27 న‌వంబ‌ర్, 2009న విడుద‌ల కాగా, నేటికి 10 సంవ‌త్స‌రాలు అవుతుంది. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ త‌న ట్విట్ట‌ర్‌లో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు. సినిమాలోని లిరిక్ “ఉప్పెనంత ఈ ప్రేమ‌కి, గుప్పెడంత గుండె ఏమిటో” అని రాసి, “నా హృద‌యం ఇప్ప‌టికి స‌రిపోవ‌డం లేదు. మీరు చూపించిన ప్రేమ‌కి ధ‌న్యవాదాలు. ఆర్య‌, ఆర్య‌2 వంటి హిట్స్ ఇచ్చిన సుక్కూకి ఎలా ధ‌న్య‌వాదాలు చెప్పాలో తెలియ‌డం లేదు. నా ఊపిరి ఆగిపోయినా.. ఐలవ్ యూ.. నా ప్రాణం పోయినా.. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను” అని సుక్కూపై త‌న‌కున్న పఅభిమానాన్ని వ్యక్తపరిచారు బ‌న్నీ. త్వ‌ర‌లో బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొంద‌నుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఇక ఆర్య‌ చిత్రం విడుద‌లై మే 7,2019 నాటికి 15 సంవత్స‌రాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

Related posts