ఏపీ బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. వచ్చేనెల 11వ తేదీ నుంచి పదిహేను రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. 12న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలకు ముందస్తుగా, జూలై మొదటి వారంలో ఆర్థిక మంత్రి ఇతర మంత్రులతో సమావేశమై బడ్జెట్ పై చర్చించనున్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులకు వడ్డీలేని రుణాలు, పంట బీమా పథకం ప్రీమియం ప్రభుత్వమే చెల్లించడం వంటి అంశాలతోపాటు నవరత్నాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
స్కూళ్లలో మౌలికవసతులు ఎలా కల్పిస్తారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి