telugu navyamedia
సినిమా వార్తలు

సల్లూ భాయ్ కి రామ్ చరణ్ సాయం

Ram-Charan

సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ ల మధ్య క్లోజ్ బాండింగ్ ఉంది. రామ్ చరణ్ ముంబై వెళ్తే అక్కడ సల్మాన్ ని కలవకుండా రాడు. ఇకఅంతకుముందు సల్మాన్ ఖాన్ నటించిన “ప్రేమ్ రతన్ ధన్ పాయో” చిత్రానికి సల్మాన్ కు రామ్ చరణ్ వాయిస్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో మరోసారి సల్లూ భాయ్ కు వాయిస్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. తాజాగా సల్మాన్ నటిస్తున్న చిత్రం “భారత్” టి-సిరీస్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన చిత్రం “భారత్”. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘ ఓడ్ టూ మై ఫాదర్’ మూవీకి మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసారు. ఇందులో సల్మాన్‌కు జంటగా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. సల్మాన్‌ సోదరి పాత్రలో మరో హీరోయిన్ దిశా పటానీ సందడి చేయనున్నారు. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు నిర్మాతలు చెప్తున్నారు.  భారత్ మూవీ తెలుగు వెర్షన్ లో సల్మాన్ ఖాన్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఇస్తున్నారు. ఈ సినిమాను భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల సమాహారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో సల్మాన్ యువకుడిగా, గని కార్మికుడిగా,నేవీ అధికారిగా, వృద్ధుడిగా ఐదు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు.

Related posts