telugu navyamedia
సినిమా వార్తలు

దోమకొండ శివాలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు

Ram-Charan

సోమవారం శివరాత్రి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించారు భక్తులు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా దోమకొండ కోటలోని శివలింగానికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ గుడి తెలంగాణ ప్రాంతంలోని ప్రాచీన సంస్థానాల్లో ముఖ్యమైనది. కామారెడ్డి జిల్లాలో ఈ సంస్థానము ఉంది. దోమకొండ కోటలోని ఈ శివాలయం 800 ఏళ్ళ క్రితం కాకతీయుల కాలంలో తమ పూర్వీకులు నిర్మించారని ఉపాసన ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ప్రత్యేకంగా పంచె కట్టుకుని, నీటితో స్వయంగా శివలింగాన్ని శుభ్రం చేసి, భక్తిశ్రద్ధలతో శివలింగానికి పూజలు చేస్తున్న వీడియోను ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Related posts