telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్ ‘జూ’ లో .. మరో కొత్త జంట.. ! సందర్శకులను అలరించడానికే.. !!

new couple of animals into zoo soon

హైదరాబాద్ జూపార్క్ అధికారులు నగరంలోని జంతుప్రదర్శనశాల ను సందర్శించడానికి వచ్చే వారికి మరింత ఆనందాలను అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సందర్శకుల ఆనందాలే ప్రథమంగా భావించే అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. జంతు ప్రదర్శనశాలలో మరిన్ని జంతువులను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జూ పార్క్‌లో జిరాఫీ సందర్శకులను అలరిస్తున్నా, మరోజంట జిరాఫీని సందర్శకులను అలరించడానికి కోల్‌కత్తా నుంచి నగరానికి తీసుకురానున్నారు.

కోల్‌కత్తాలోని అలీపూర్ జూకు చేరుకుని జిరాఫీని నగరానికి తరలించడానికి, ఇప్పటికే జూ పార్క్ అధికారులు చేయవలసిన ప్రక్రియను పూర్తి చేశారని జూ పార్క్ అధికారులు తెలిపారు. కేంద్ర జూ అథారిటీ అధికారుల అనుమతితో కోల్‌కత్తా నుంచి జిరాఫీలను తరలించేందుకు కసరత్తు పూర్తి చేశామని జూ అధికారులు చెప్పారు. జిరాఫీని ప్రత్యేక వాహనాల్లో రోడ్డుమార్గంలో తరలిస్తున్నామని, నాలుగు నుంచి ఐదు రోజుల్లో నగర జూపార్క్‌లో కొత్త జిరాఫీ జంట సందర్శకులను అలరించనున్నదని అధికారులు తెలిపారు.

Related posts