telugu navyamedia
సినిమా వార్తలు

డియర్ కామ్రేడ్ : నీ నీలి కన్నుల్లో… వీడియో సాంగ్

Nee Neeli Kannullona Lyrical Song,Dear Comrade

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన “డియర్ కామ్రేడ్” చిత్రం భారీ అంచనాలతో ఈనెల 26న విడుదలైంది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకెళుతుంది. ముఖ్యంగా జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ అందించిన సంగీతం సినిమాల‌పై మ‌రిన్ని అంచ‌నాలు పెంచింది. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా తాజాగా ‘నీ నీలి కన్నుల్లోని ఆకాశమే..తెల్లారి అల్లేసింది నన్నే..నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి..నీ వైపే లాగేస్తుంది నన్నే’ అంటూ సాగే పాట ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. అద్భుతమైన లిరిక్స్‌తో పాటు విజువ‌ల్స్ అందరినీ అలరిస్తున్నాయి. గౌతమ్ భరద్వాజ్ ఆలపించిన ఈ పాట‌కి రెహ‌మాన్ లిరిక్స్ అందించారు. డియ‌ర్ కామ్రేడ్ చిత్రం హిందీలోను రీమేక్ కానుంది. ద‌ఢ‌ఖ్ పెయిర్ ఇషాన్, జాన్వీ క‌పూర్ రీమేక్ చిత్రంలో హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తార‌ని సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు పుట్టుకొస్తున్నాయి.

Related posts