telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలంటూ.. రాఖీ సావంత్‌ వినూత్న నిరసన

బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా బిగ్‌బాస్‌ షో మొదలైందంటే చాలు.. టీఆర్పీ రేటింగ్స్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోతాయి. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరుకుతుంది. బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ తనను బిగ్ బాస్-15 ఓటీటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. మంగళవారం ఉదయం స్పెడర్‌ ఉమెన్‌ గెటప్‌ వేసి, ముంబై వీధుల్లో తిరుగుతూ హల్‌ చల్‌ చేసింది. అభిమానులతో కలిసి డ్యాన్స్‌ చేస్తూ సందడి చేసింది.

తాను రాఖీని కాదని.. స్పైడర్-ఉమెన్ అని అంటూ వినోదాత్మక చేష్టలతో అభిమానులను అలరించింది. తనకు బిగ్‌బాస్‌ షో అంటే చాలా ఇష్టమని చెబుతూ.. ఓటీటీ సీజన్‌లోకి తనను ఆహ్వానించకపోవడం బాధగా ఉందంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. సిద్ధార్థ్ శుక్లా.. షెహ్నాజ్ గిల్ లను ఆహ్వానించి.. తనను ఎందుకు ఆహ్వానించలేదని ఆమె ప్రశ్నించింది. ప్రస్తుతం రాఖీ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వోట్‌ జరుగుతుండగా.. ఈ షోకి కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Related posts