telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“హాటెస్ట్ మామ్స్” ఏంటి.. ? మ్యాగ్‌జైన్ పై వివేక్ అగ్నిహోత్రి ఫైర్

Malaika

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు మలైకా అరోరా, శిల్పాశెట్టిలకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ పెళ్ళై పిల్లలు ఉన్నప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదనే చెప్పుకోవాలి. తాజాగా ఓ ఫిల్మ్ మ్యాగ్‌జైన్ బాలీవుడ్ నటీమణులు మలైకా అరోరా, శిల్పాశెట్టిలను ‘హాటెస్ట్ మామ్స్’ అంటూ వర్ణించడం వివాదాస్పదమైంది. మలైకా అరోరా, శిల్పాశెట్టి కలిసి ఉన్న ఫొటోను పెట్టి.. బాలీవుడ్‌లో వీరిద్దరు ‘హాటెస్ట్ మామ్స్’ అంటూ ఫిల్మ్ మ్యాగ్‌జైన్ ట్వీట్ చేసింది. ఆ మ్యాగ్‌జైన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తల్లులను ఇలా వర్ణించడం సిగ్గుచేటు అని అన్నారు ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి. సదరు మ్యాగ్‌జైన్ ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ ‘‘ఈ రకమైన మూర్ఖత్వపు మాటలను ఇకపైనైనా ఆపుతారని భావిస్తున్నాను. ‘హాటెస్ట్ అమ్మ’ ఏమిటి? శరీర ఆకృతి ఆధారంగా మీరు తల్లుల మధ్య తరగతిని సృష్టించినప్పుడు ఇది అన్నిటికంటే స్త్రీవాదానికి పెద్ద కారణమవుతుంది. సిగ్గుచేటు..’’ అని వివేక్ అగ్నిహోత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts