telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

పార్టీకి అండే కార్యకర్త…

బ్యానర్ కట్టేవాడు కార్యకర్త
ఫ్లెక్సీ వేసేవాడు కార్యకర్త
ఓట్లడిగేవాడు కార్యకర్త
ఓట్లు వేయించేవాడు కార్యకర్త
డబ్బు పంచేవాడు కార్యకర్త
మందు పంచేవాడు కార్యకర్త
తేడావస్తే జైలుకెళ్ళేవాడు కార్యకర్త
భాణసంచా కాల్చేవాడు కార్యకర్త
నాయకుల జయంతులు జరిపేవాడు కార్యకర్త
నాయకుల వర్థంతులు జరిపేవాడు కార్యకర్త
నాయకులు వస్తే పూలహారాలు వేసే వాడు కార్యకర్త
నాయకులను పూలపై నడిపించేవాడు కార్యకర్త
కార్యక్రమాలకు జనాలను తరలించేవాడు కార్యకర్త
తరలించిన జనాల బాగోగులు చూసేవాడు కార్యకర్త
అనునిత్యం జనాలలో ఉండేవాడు కార్యకర్త
పార్టీకి వెన్నుముక కార్యకర్త
పార్టీ పథకాలకు ప్రచారం కల్పించేవాడు కార్యకర్త
పార్టీని అధికారం వైపు నడిపించేవాడు కార్యకర్త

Related posts