telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

భారీగా పడిపోయిన బంగారం ధరలు…

బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే తాజాగా అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం, వెండి ధరలు బాగా పడిపోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ. 10 తగ్గి రూ. 47,830 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 43,840 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి రూ. 45,490 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 41,700 పలుకుతోంది. బంగారం ధర తగ్గగా.. వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. కిలో వెండి ధర రూ.69,500 వద్ద కొనసాగుతోంది.

Related posts