telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆర్టికల్ 370 రద్దు .. నోటిఫికేషన్ విడుదల…

Ram Nath Kovind

భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆర్టికల్ 370 రద్దుపై సంతకం చేశారు. దీంతో ఇకపై ఈ అధికరణకు సంబంధించిన అన్ని నిబంధనలు శాశ్వతంగా రద్దు అయినట్టే. ఇప్పటి నుంచి ఈ నిబంధన చెల్లుబాటులో ఉండదని మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 నిబంధన 3(రెడ్‌విత్ క్లాజ్ 3) ద్వారా రాష్ట్రపతికి సమకూరిన అధికారాల మేరకు పార్లమెంటు సిఫారసుతో ఆగస్టు ఆరు నుంచే ఈ ఆర్టికల్ రద్దు అయినట్టు పేర్కొంది.

ఈ మేరకు రాష్ట్రపతి సంతకంతో కూడిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఆర్టికల్ 370లో సవరణలు చేసినవి, ఎలాంటి మార్పులు, మినహాయింపులు లేని అన్ని రాజ్యాంగ నిబంధనలు జమ్ముకశ్మీర్‌కు వస్తాయని ఆ నిబంధనలో పేర్కొన్నారు.

Related posts