ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. భారత్-చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావిస్తూ మరోసారి రాహుల్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ పిరికితనం వల్లే చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతోందంటూ ఆయన మరోసారి ఆరోపణలు గుప్పించారు.
‘భారత ఆర్మీ సామర్థ్యం, శౌర్యంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంది. ప్రధాని మోదీకి మాత్రం లేదు. ఆయన పిరికితనం వల్లే మన భూమిని చైనా తీసుకునేలా చేసింది. ప్రధాని మోదీ చెబుతోన్న అసత్యాల వల్ల ఆ భూమి వారి అధీనంలోనే ఉండేలా చేస్తాయి’ అని రాహుల్ ఆరోపించారు.
ఆ మీడియా పై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది: జగన్