telugu navyamedia
సామాజిక

పోలార్ వోర్టెక్స్ ప్రభావం… మరుగుతున్న నీరు కూడా…

సాధారణంగా మరిగిపోతున్న నీటిని గాల్లోకి విసిరేస్తే ఏం జరుగుతుంది. అలా చేసినప్పుడు ఒక్కచుక్క శరీరంపై పడ్డా కూడా కాలిపోతుంది. కాబట్టి అలా చేయడానికి ఎవరైనా ఖచ్చితంగా భయపడతారు. అంతేకాదు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యాలని ఎవరూ అనుకోరు కూడా. అయితే అమెరికాలో మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీలకు పడిపోవడంతో… అక్కడి ప్రజలను ఈ పోలార్ వొర్టెక్స్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. చలిగాలుల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలిగాలుల కారణంగా అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతం గడ్డకట్టుకుపోతోంది. కానీ కొంతమంది మాత్రం అక్కడ చలి ఎముకలు కొరికేస్తున్నా… సరదాగా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న చలి తీవ్రతకు మరుగుతున్న నీటిని గాల్లోకి విసిరేయగా… నిమిషంలో ఆ నీరంతా మంచుగా మారిపోతోంది. ఇలాంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts