telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మే 3 వరకు రైళ్లు రద్దు.. రైల్వే శాఖ క్లారిటీ!

train secunderabad

మే 3 వరకూ దేశవ్యాప్తంగా అన్నీ రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రోజు జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మోదీ ప్రకటన అనంతరం రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది. ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, మెట్రో రైల్ సర్వీసులను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తే రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమౌతాయని అంతా అనుకున్నారు. రైల్వే అనుమతించడంతో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు కూడా కొన్నారు. అయితే మే 3 వరకూ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇప్పటికే కొన్న టికెట్లకు వంద శాతం డబ్బు తిరిగి చెల్లిస్తామని చెప్పారు.

Related posts