telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్లాస్టిక్ తెచ్చి ఇస్తే.. బహుమతులు తీసుకెళ్లొచ్చు ..

plastic exchange with other goods

ఏపీలోని ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లా చీరాల కూరగాయల మార్కెట్‌ సమీపంలో గాంధీజయంతి సందర్భంగా ఒక అంగడిని ప్రారంభించారు. అక్కడ కూరగాయలు, పండ్లు, వివిధ వస్తువులు ఉంచారు. వాటిని తీసుకెళ్లాలంటే డబ్బులు ఇవ్వక్కర్లేదు.. ప్లాస్టిక్‌ వ్యర్థాలు తెచ్చిస్తే చాలు. వినియోగదారులు తెచ్చినవాటిని తూకం వేసి, ఆ మేరకు వారు కోరిన వస్తువులు ఇస్తున్నారు. ప్రజలు కూడా దీనికి స్పందించి తొలిరోజే 50 కిలోలకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు తెచ్చారు.

పాలిథీన్‌ క్యారీబ్యాగ్‌ల వాడకం నియంత్రణలోకి వచ్చేవరకు ఈ అంగడి కొనసాగిస్తామని కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ‘మన పెద్దాపురం’ ఫేస్‌బుక్‌ గ్రూపు సభ్యులూ ఇలాంటి ఆలోచనను అమలుచేస్తున్నారు. వాళ్లు ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీసుకుని బియ్యం పంపిణీ చేస్తున్నారు. గాంధీజయంతి సందర్భంగా పెద్దాపురంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Related posts