తెలంగాణలోని ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందినవారిని లావణ్య (35), రోషిణి (14), సుశీల్ (28), ప్రశాంత్ (26)గా పోలీసులు గుర్తించారు.
మృతులందరు నిజామాబాద్ జిల్లా నవీపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయి పోయింది. ప్రమాదం జరిగిన కారులో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్‌తో కారు భాగాలను విడదీసి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులుసహాయక చర్యలను చేపట్టారు.