telugu navyamedia
సినిమా వార్తలు

ఓ అపూర్వ సుందరీ . . ! 

prema kanyaka poetry corner

చలువ వలువల్లో ! 
నల్లని కురులతో ! 
నుదుట సంధ్య భాస్కరుని తో ! 
వెండి కాంతుల ఆభరణాలతో ! 
ఆలుచిప్పలాంటి నయనాలతో ! 
కోటేరు ముక్కు తో ! 
మధువు లోలుకు  పెదవులతో ! 
కెంపువర్ణపు గులాబీ బుగ్గల తో ! 
చిరు దరహాసంతో ! 
నల్లపూసల హారముతో ! 
మణులు పొదిగిన కంఠాభరణము తో ! 
కలువ రేకులకనుబొమ్మలతో ! 
బంగారు మేని చాయతో  ! 
దివి నుండి భువికి దిగివచ్చిన దేవత ను 
తలపించే ఓ అపూర్వ సుందరీ ! 
స్వాగతం పలుకుతున్న
నీ సౌందర్యానికి దాసోహం ! ! 
నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మకు 
పాదాభివందనం ! 
నీకు అభివందనం ! ! 

– పల్లోలి శేఖర్ బాబు, కొలిమిగుండ్ల

Related posts