telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిత్యామీనన్ “సైకో” టీజర్… నగ్నంగా…!?

ఉదయనిధి స్టాలిన్ హీరోగా దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ‘సైకో’ చిత్రం టీజర్ శుక్రవారం విడుదలైంది. టీజర్ ఆసాంతం తెలియని భయమేదో వెంటాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సైలెంట్‌గా సాగిన టీజర్‌లో అక్కడక్కడా ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు కూడా ఉన్నాయి. మరో విషయమేంటంటే.. టీజర్ ప్రారంభంలో ఓ వ్యక్తి నగ్నంగా నిలబడి ఉన్న సీన్‌ను చూపించారు. ఆ వ్యక్తి ఉదయనిధి స్టాలినా..? లేక మరొకరా..? అన్నది రివీల్ చేయలేదు. మొత్తం మీద హర్రర్ కంటెంట్‌తో ప్రేక్షకులను భయపెట్టేలా ఉన్న ఈ టీజర్‌ ‘సైకో’పై అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. సైకోలో ఉదయనిధి స్టాలిన్‌తో పాటు నిత్యా మీనన్,అదితిరావు హైదరి నటిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘కన్నె కలైమానె’ సినిమాతో మంచి హిట్ అందుకున్న స్టాలిన్.. ఇప్పుడు ‘సైకో’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు. సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ఫిక్స్ చేసే అవకాశం ఉంది.

Related posts