telugu navyamedia
crime culture news trending

కిటికీకి వేలాడుతున్న మూడేళ్ళ బాలుడు… గాఢ నిద్రలో తండ్రి… చివరకు…

Window

అమెరికాలోని న్యూజెర్సీలో ఓపెన్ కిటికీ కారణంగా మూడేళ్ల బాలుడు తృటిలో పాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇరుగు పొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బాలుడి ప్రాణాలను కాపాడగలిగారు. న్యూజెర్సీ నట్లీలోని వాషింగ్టన్ ఎవెన్యూలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పిల్లోడి తండ్రి గాఢనిద్రలో ఉండగా.. ఆడుకుంటూ ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు రెండో అంతస్థులో నివసిస్తున్న ఇంట్లోని ఓపెన్ కిటికీ వద్దకు వచ్చాడు. కిటికీ వద్ద ఓ హ్యాంగర్‌కు వేలాడుతూ ఇరుగు పొరుగు వారికి కనిపించాడు. వారు వెంటనే బాలుడిని రక్షించడానికి ప్రయత్నించారు. పోలీసులకు కూడా సమాచారమిచ్చారు. పోలీసులు నిమిషాల్లోనే అక్కడకు చేరుకోవడంతో రెండు అంతస్థులు ఎక్కి అధికారులు ఆ బాలుడి ప్రాణాలను కాపాడారు. తండ్రి నిద్రపోతున్న సమయంలో ఇలా జరగడంతో ఎటువంటి కేసును నమోదు చేయలేదు. ఓపెన్ కిటికీ ఉన్న వారు జాగ్రత్త వహించాలని సూచించి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related posts

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు .. కిటకిటలాడుతున్న ఆలయాలు…

vimala p

కేసీఆర్ ..స్టాలిన్ భేటీ .. నేడే..

vimala p

కేజీఎఫ్-2 : అధీరాగా సల్మాన్ లుక్ అదుర్స్

vimala p