telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘బిగ్‌బాస్’ అంటే భయపడుతున్నకంటెస్టెంట్‌లు

star maa promo on bigg boss 3

స‌క్సెస్ ఫుల్‌ సాధించిన షోలలో బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికి మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక అన్నీ కుదిరితే ఈ ఏడాది జూలైలో నాలుగో సీజన్‌ ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు, హోస్ట్‌ల కోసం నిర్వాహకులు ఇప్పుడు పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఈ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌లుగా పాల్గొనేందుకు ఎవ్వరూ ఆసక్తిని చూపడం లేదని సమాచారం. ఎందుకంటే బిగ్‌బాస్‌ షోపై చాలా మందికి నెగిటివ్ సెంటిమెంట్ ఉందట. బిగ్‌బాస్‌లో పాల్గొని హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎవ్వరికీ పెద్దగా ఆఫర్లు రావడం లేదట. కంటెస్టెంట్లు మాత్రమే కాదు బిగ్‌బాస్ విన్నర్‌లకు కూడా షో తరువాత అడపాదడపా అవకాశాలు మాత్రమే వస్తున్నాయట. ఇందుకు ఉదాహరణగా మూడు సీజన్లలో విజేతలైన శివబాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్‌లను చూపిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ షోలో పాల్గొనకపోవడమే మంచిదని చాలామంది భావిస్తున్నారట. దీంతో నిర్వాహకులు ఫోన్లు చేస్తున్నా వారు పట్టించుకోవడం లేదట. ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇస్తామని చెప్పినా.. ఈ షోలో పాల్గొనేందుకు వారు ఆసక్తిని చూపడం లేదన్నది టాక్‌. ఈ క్రమంలో కొంతమంది సింగర్లు, సెకండరీ గ్రేడ్ నటులను తీసుకురావాలని బిగ్‌బాస్‌ నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం.

Related posts