telugu navyamedia
వార్తలు సామాజిక

భారత్‌లో ఇక సేవలు అందించలేం: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

Amnesty International

భారత్‌లో ఇక తాము సేవలు అందించలేమని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కీలక ప్రకటన తెలిపింది. భారత ప్రభుత్వం అప్రజాస్వామికంగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా చెప్పుకొచ్చింది. భారత్‌లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తాజాగా ఆరోపణలు చేసింది.

ఈ నెల 10న తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ ఈడీ పూర్తిగా స్తంభింపజేసిందని చెప్పింది. ఈ నేపథ్యంలో భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై తామిచ్చిన నివేదికల నేపథ్యంలో తమ సభ్యులకు బెదిరింపులు ఎదురవుతున్నాయని చెప్పింది.

మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం సర్కారుకి ఇష్టం లేదని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పుకొచ్చారు.ఢిల్లీ అల్లర్లతో పాటు జమ్మూ కశ్మీర్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదని తెలిపింది. ప్రపంచంలో 70కి పైగా దేశాలలో పనిచేస్తున్న తమ సంస్థ 2016లో రష్యాలో మాత్రమే కార్యకలాపాలను నిలిపేశామని తెల్పింది. ఇప్పుడు భారత్‌లో కూడా తమ కార్యకలాపాలను మూసేస్తున్నామని వెల్లడించింది.

Related posts