telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బెదిరించగానే .. చిత్తం బాబయ్య అనేవారెవరూ లేరిక్కడ.. : ఉ.కొరియా

kim and trump meet failed

ఇటీవలి కాలంలో డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలపై ఉ.కొరియా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యవహారశైలి తమ దేశాన్ని బెదిరించే విధంగా ఉందని, అయితే ఇది అయనలో వ్యక్తమవుతున్న భయాందోళనలను కూడా ప్రస్ఫుటం చేస్తోందని ఉ.కొరియా అధికార వర్కర్స్‌ పార్టీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు, పొలిటికల్‌ బ్యూరో సభ్యుడు రిాసుయాంగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘కిమ్‌జోంగ్‌ ఉన్‌ అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని, ఆయన ఇలాగే బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తే అన్నీ కోల్పోతార’ని ట్రంప్‌ ఆదివారం ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రిాసుయాంగ్‌ బెదిరింపులకు తాము లోంగమని, ఈ విషయాన్ని ట్రంప్‌ గ్రహిస్తే మంచిదని’ తన ప్రకటనలో పేర్కొన్నారు. కొరియా నుంచి వ్యతిరేక పరిణామాలను చూడకూడదనుకుంటే ట్రంప్‌ ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని ఆయన సూచించారు.

అమెరికాతో చర్చల విషయంలో ఈ ఏడాది చివరికి తమ తుది నిర్ణయం వెలువడుతుందని, తమ అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ దానిని ప్రకటిస్తారని తెలిపారు. ఎదుటి వారు చేసినట్లుగా తమ నేత ఎవరినీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించటం లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలోగా అమెరికాతో ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదరకపోతే, తమ దేశం కొత్త దారి చూసుకుంటుందని కిమ్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బెదిరింపులతో కాలం వృధా చేయకుండా తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం కావాలని ఆయన అమెరికాను సవాల్‌ చేశారు. ఉ.కొరియా గురించి ట్రంప్‌ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయన్నారు. తాము కోల్పోయేదేమీ వుండదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా తమ నుండి ఎదైనా తీసుకెళ్లవచ్చు కానీ, ఆత్మగౌరవాన్ని, అమెరికా వ్యతిరేకతను తమ నుండి తీసుకెళ్లలేరని ఆయన పునరుద్ఘాటించారు.

Related posts